Saturday, July 25, 2009

రొయ్యల కట్లెట్‌

కావలసినవి: మంచి నీటి చిన్న రొయ్యలు-150గ్రా, శనగపిండి-2 టేబుల్‌ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్టు-1టీ స్పూను, ఉల్లిపాయ-1, పసుపు-అర టీ స్పూను, కారం-అర టీ స్పూను, గరంమసాలా పొడి-1టీ స్పూను, కొత్తిమీర-1కట్ట, నిమ్మరసం-1టేబుల్‌ స్పూను, బియ్యప్పిండి-అరకప్పు, ఉప్పు -రుచికి తగినంత, నూనె-వేగించడానికి సరిపడా.

తయారుచేసే విధానం: పొట్టుతీసి, శుభ్రపరచిన రొయ్యలకు ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం పట్టించి 10 నిమిషాల పాటు పక్కనుంచాలి. ఉల్లిపాయ, కొత్తిమీర సన్నగా తరిగి అందులో కారం, గరంమసాల పొడి, శనగపిండితో పాటు రొయ్యల్ని కూడా వేసి (అవసరమైతే అరకప్పు నీళ్లు వాడొచ్చు) ముద్దలా తయారుచేసుకొని, దీన్ని 6 భాగాలుగా విభజించుకోవాలి. ఒక్కో భాగాన్ని వడల్లా వత్తుకుని రెండువైపులా బియ్యప్పిండిలో ముంచి, నూనెలో దోరగా వేగించుకోవాలి. వీటిని వేడివేడిగా టమోటా సాస్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. చిన్న పిల్లలు వీటిని బాగా ఇష్టపడతారు. చాలా బలవర్ధకం కూడా









No comments:

Post a Comment