Saturday, July 11, 2009

విజిటబుల్ కూట్


ఈ వంటకం పేరు:విజిటబుల్ కూట్

కావల్సిన పదార్దాలు:
1:1/2దొండకాయలు

2:వందగ్రాములు గోరు చిక్కుడుకాయలు 3:మూడు క్యారెట్లు 4:పావుకిలో క్యాబేజ్

5:రెండు బంగాళ దుంపలు 6:రెండు ఉల్లిపాయలు 7:రెండు టొమటలు

8:పది పచ్చి మిరపకాయలు 9:ఒక కప్పు నాన బెట్టిన బియ్యం 10:కొంచెం ఎండు కొబ్బరి

11:కొత్తి మీర 12:పసుపు ఒక టీ స్పూన్ 13:1/2 కప్పు నూనె 14:ఒక కప్పు పెరుగు

15:ఉప్పు సరిపడినంత

తయారు చేయు విధానం: ముందు కూరగాయలన్ని కదిగి సన్న ముక్కలు చేసుకొని సరిపడ నీరు పోసి ఉడికించాలి.ఉడికిన ముక్కలు పక్కన పెట్టుకొని స్టవ్ మీద పాన్ పెట్టి నూనె పోయాలి అ తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు టొమట ముక్కలు పచ్చిమిర్చి,జీలకర్ర వేసి దొరగా వేయించాలి వ్3ఏగినతరువాత పాన్ లో ఉడికించిన ముక్కలు అన్ని వేయాలి(నీళ్ళు కూడ)స్టవ్ తగ్గించి ఉంచుకొని మిక్సీలో ఎండుకొబ్బరి నానబెట్టిన బియ్యం 4 పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని స్టవ్ మీద ఉన్న పాన్ లో అ పేస్ట్ వేసి బాగ కలియ బెట్టి ఐదు నిమిషాలు తగ్గించిన స్టవ్ మీద ఉంచి ఒక కప్పు పెరుగు కొంచం కొత్తి మీర అందులో వేసి సరిపడ సాల్ట్ వేసి బాగ కలపాలి క్రిందకు దింపి వేడిగా వడ్డించుకొండి

[ఇది చపాతి,పూరి లకు స్పెషల్ కర్రీ]

No comments:

Post a Comment