కావలసిన పధార్ధలు:-
1....1/2కప్పుల వరిపిండి
2....మధ్యరకం కొబ్బరికాయ
3....1/2కప్పు చిక్కని పాలు
4.1/2 కప్పు వెన్న లేదా నెయ్యి
5....1/2 కప్పు పంచదార
6....1టేబుల్ స్పూన్ జీడిపప్పు
7....1/2టీ స్పూన్ బేకింగ్ పౌడర్
8.....1/2 టీ స్పూన్ మీకిష్ఠమైన ఎసెస్సు
9.....1గుడ్డు
10.చిటికెడు ఉప్పు అలంకరించేందుకు:-గుప్పెడు చెర్రీకాయలు వేయించిన బాదంపప్పులు తయారు చేయు విధానం:-వెన్నను బాగాగిలకొట్టి అందులోపంచదారను,పిండినికొంచెంగావేస్తూబాగాకలిపి,ముద్దగా చేయండి కొబ్బరి తురుమునుండి జీడిపప్పును సన్నగాతరిగిపెట్టండి.పైన కలిపిన పిండిలోవీటిని కూడా వేసి కలపండి,మిగతా పధార్ధాలను కూడా అందులో కలపండి.ప్రెషర్కుక్కర్ లో లోపల ఉండే పాత్రను తీసుకుని,లోపలి భాగానికి కొంచెం వెన్నపూసి,అందులోకలిపిపెట్టుకున్న మిశ్రమాన్ని ఉంచండి కుక్కర్ లో ఈ పాత్రను వుంచి,పాత్ర ఎత్తులో 2/3 వంతు వచ్చే వరకూ నీరుపోసి,పెద్దమంటలో వెయిట్ ఉంచకుండా 20నిమిషాలు ఉడికించండి ఆ పై మంట తగ్గించి మరో 10నిమిషాలు ఉడకనిచ్చి,దించండి.చల్లారిన తరువాత,కేకును బయటకు తీసి,చెర్రీలు బాదం పప్పులతో అలంకరించి వడ్డించండి
nice recipe...chesina photo kuuda pettiuntea baagundedi anipichindi.ee recipe ni nenu tappakunda try chestanu.thank you
ReplyDeletewww.maavantalu.com