Saturday, July 25, 2009

వెజిటబుల్ సల్ నూ

See full size image
2 బంగాళదుంపలు 2 చిలకడదుంప 1కప్పు ఉడికించిన పచ్చిబటానీలు 1కప్పు ఫ్రెంచ్ బీన్స్ [ముక్కలు] 12వెల్లుల్లిరేకులు 12పచ్చిమిరపకాయలు 1 టీ స్పూను పసుపు 1/2స్పూనుల ఆవాలు 1పెద్ద కొత్తిమీరకట్ట 2 నిమ్మకాయలు రసం 1గుండ్రని వంకాయ 3క్యారెట్లు,4ఉల్లిపాయలు 1చిన్న కాల్లీఫ్లవర్ 1అంగుళం అల్లముక్క 1టీస్పూన్ జీలకర్ర 1 1/2స్పూన్ కారం 1/2కప్పు కొబ్బరికాయ 1 1/2 టి స్పూన్ ఉప్పు తయారు చేయు విధానం:-కూరగాయలను కడిగి శుబ్రం చేసుకొని చిన్నముక్కలుగా కోసి పెట్టుకొండి కళయిలో తగినంత నూనెపోసి తరిగిన కూరగాయ ముక్కలనుకొంచంగా వేయించి తీసుకొండి కళాయిలో1/2కప్పు నూనెను మాత్రం ఉంచి ఆవాలు తరిగిన ఉల్లిపాయ అందులోతరిగిన అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి ముక్కలను వేసి కలిపి కారం జీలకర్ర పసుపు వేసి కలిపి కాస్సేపు వేయించి అందులో వేయించిప్రక్కనబెట్టి కూరగాయ ముక్కలను వేసికలపండి కాస్సేపు మగ్గనిచ్చి తరిగిన కొత్తిమీర నిమ్మరసం చల్లి 1/2కప్పు నీరుపోయంది సన్నని మంటమీద నీరంతా ఇగిరి నూనె పైకి తేలుతుండగా దించి వేడిగా సర్వ్ చేయండి

Many people blame their unhealthy lifestyle on the fact that fruit and vegetables “taste boring”. However, nothing could be further from the truth.

There are numerous ways to prepare delicious vegetables, whether you choose to grill, steam, stir fry or serve them raw. You can even juice many vegetables to make tasty and nutritious drinks.


రొయ్యల కట్లెట్‌

కావలసినవి: మంచి నీటి చిన్న రొయ్యలు-150గ్రా, శనగపిండి-2 టేబుల్‌ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్టు-1టీ స్పూను, ఉల్లిపాయ-1, పసుపు-అర టీ స్పూను, కారం-అర టీ స్పూను, గరంమసాలా పొడి-1టీ స్పూను, కొత్తిమీర-1కట్ట, నిమ్మరసం-1టేబుల్‌ స్పూను, బియ్యప్పిండి-అరకప్పు, ఉప్పు -రుచికి తగినంత, నూనె-వేగించడానికి సరిపడా.

తయారుచేసే విధానం: పొట్టుతీసి, శుభ్రపరచిన రొయ్యలకు ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం పట్టించి 10 నిమిషాల పాటు పక్కనుంచాలి. ఉల్లిపాయ, కొత్తిమీర సన్నగా తరిగి అందులో కారం, గరంమసాల పొడి, శనగపిండితో పాటు రొయ్యల్ని కూడా వేసి (అవసరమైతే అరకప్పు నీళ్లు వాడొచ్చు) ముద్దలా తయారుచేసుకొని, దీన్ని 6 భాగాలుగా విభజించుకోవాలి. ఒక్కో భాగాన్ని వడల్లా వత్తుకుని రెండువైపులా బియ్యప్పిండిలో ముంచి, నూనెలో దోరగా వేగించుకోవాలి. వీటిని వేడివేడిగా టమోటా సాస్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. చిన్న పిల్లలు వీటిని బాగా ఇష్టపడతారు. చాలా బలవర్ధకం కూడా









Monday, July 13, 2009

పెట్ల:

కావలసిన పధర్దాలు : 1.గ్లాసుడు శనగపిండి 2.రెండు ఉల్లిపాయలు 3.కొంచం మినపప్పు(3 స్పూన్ లు) 4.ఒక కప్పు ఆయిల్ 5.ఆవాలు 2స్పూన్లు 6.జీలకర్ర 2 స్పూన్లు 7.మిరియాలపోడి ఒకస్పూన్ 8.కొత్తిమీర కరివేపాకు తయారుచేయు విధానం : మొదటగా శనగపిండి కొద్దిగా పలచగా ఉండేటట్టు నీటితో కలిపి పెట్టుకోవాలి స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ పోసి ఉల్లిపాయ, ముక్కలు, మినపప్పు ,ఆవాలు ,జీలకర్ర వేసి వేయించుకొని వెగిన తరువాత కలిపిన శనగపిండి పాన్లో పోసి అడుగట్టకుండా ఉదికించాలి(ఐదు నిమిషాలు)కొద్దిగా మిర్యాలపొడి వేసి కొత్తిమీర కరివేపాకు వేసి కలుపుకొని దింపుకొని తినదమే (చపాతిలకు దొసెలకు

Sunday, July 12, 2009

అమితాబ్ కి ఇష్టమయిన గులాబ్ జాం

అమితాబ్ కాస్త ఖాళీ దొరికితే చేసేపని పుస్త్కాలు చదవడం,సినిమాలు చూడటం అవేకాదు తియ్యతియ్యని గులాబ్ జాం లు చేయించుకొని తింటుంటారు అది ఎవరితోనొ కాదండోయ్ జయతో ఇప్పుడు కొత్తగా ఐశ్వర్యరాయ్ తో అమితాబ్ కి చెంబూర్ గులబ్ జాములంటే అపరిమితమైన ఇష్టం

గులాబ్ జాం:-
కావలసిన పదార్ధములు: 1.గులబ్ జాం పౌడర్ తెచ్చుకొని 2.పంచదార (ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ పంచదార) 3.1/2కప్పు పాలు తయారు చేయు విధానం:పంచదార పాకంచేసుకోవాలి(గిన్నెలో నీరు పోసి పంచదార వేసి తీగపాకం చేసు కొవాలి) స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ పోసుకొని పిండిని పాలు పోసి మెత్తగా చేసుకొని(చపాతి పిండిల గట్టిగా కలుపుకొని)చిన్న చిన్న ఉండలు చేసుకొని ఆయిల్ లో ఎర్రగా వేయించి వేగిన వాటిని పాకంలో వేయాలి 5 నిమిషాలు ఆగి తినేయడమే

చెలో కబాబ్



కావలసినవి:- 1...మటన్ :కిలో(కీమాలా కొట్టించాలి)

2...టొమాటోలు:ఎనిమిది

3...ఉల్లిపాయలు ఒకటి(సన్నగా తురమాలి
4...సోమక్(పర్షియన్ హెర్బ్)

5...4టేబుల్ స్పూన్లు,

6...ఉప్పు తగినంత,

7...మిరియాలు -తగినన్ని

తయారుచేసే విధానం *మటన్లో ఉల్లి తురుములో,ఉప్పు,మిరియాలపొడి వేసి బాగా కలపాలి
*తరవాత ఈ మిశ్రమాన్ని 8 గుండ్రని బంతుల్లా చేయాలి

*ఇప్పుడు ఓవెన్ లో పెట్టే ఎనిమిది చువ్వలు తీసుకోవాలి ఈ ముద్దల్నిచక్కగా చువ్వచుట్టూతా అంటించాలి ఇప్పుడు వీటిని ఓవెన్ళో పెట్టి గ్రిల్ చేయాలి

*అలాగే టొమాటోలను విడిగా గ్రిల్ చేయాలి

*కబాబ్ బయటకు తీశాక సోమక్పొడిని చల్లి వడ్డించాలి.ఇవిరోటి లేదా బటర్డ్ రైస్లోకి కూడా బాగుంటాయి

కోకోనట్ స్టీం కేం

కావలసిన పధార్ధలు:-
1....1/2కప్పుల వరిపిండి
2....మధ్యరకం కొబ్బరికాయ
3....1/2కప్పు చిక్కని పాలు
4.1/2 కప్పు వెన్న లేదా నెయ్యి
5....1/2 కప్పు పంచదార
6....1టేబుల్ స్పూన్ జీడిపప్పు
7....1/2టీ స్పూన్ బేకింగ్ పౌడర్
8.....1/2 టీ స్పూన్ మీకిష్ఠమైన ఎసెస్సు
9.....1గుడ్డు
10.చిటికెడు ఉప్పు అలంకరించేందుకు:-గుప్పెడు చెర్రీకాయలు వేయించిన బాదంపప్పులు తయారు చేయు విధానం:-వెన్నను బాగాగిలకొట్టి అందులోపంచదారను,పిండినికొంచెంగావేస్తూబాగాకలిపి,ముద్దగా చేయండి కొబ్బరి తురుమునుండి జీడిపప్పును సన్నగాతరిగిపెట్టండి.పైన కలిపిన పిండిలోవీటిని కూడా వేసి కలపండి,మిగతా పధార్ధాలను కూడా అందులో కలపండి.ప్రెషర్కుక్కర్ లో లోపల ఉండే పాత్రను తీసుకుని,లోపలి భాగానికి కొంచెం వెన్నపూసి,అందులోకలిపిపెట్టుకున్న మిశ్రమాన్ని ఉంచండి కుక్కర్ లో ఈ పాత్రను వుంచి,పాత్ర ఎత్తులో 2/3 వంతు వచ్చే వరకూ నీరుపోసి,పెద్దమంటలో వెయిట్ ఉంచకుండా 20నిమిషాలు ఉడికించండి ఆ పై మంట తగ్గించి మరో 10నిమిషాలు ఉడకనిచ్చి,దించండి.చల్లారిన తరువాత,కేకును బయటకు తీసి,చెర్రీలు బాదం పప్పులతో అలంకరించి వడ్డించండి

Saturday, July 11, 2009

విజిటబుల్ కూట్


ఈ వంటకం పేరు:విజిటబుల్ కూట్

కావల్సిన పదార్దాలు:
1:1/2దొండకాయలు

2:వందగ్రాములు గోరు చిక్కుడుకాయలు 3:మూడు క్యారెట్లు 4:పావుకిలో క్యాబేజ్

5:రెండు బంగాళ దుంపలు 6:రెండు ఉల్లిపాయలు 7:రెండు టొమటలు

8:పది పచ్చి మిరపకాయలు 9:ఒక కప్పు నాన బెట్టిన బియ్యం 10:కొంచెం ఎండు కొబ్బరి

11:కొత్తి మీర 12:పసుపు ఒక టీ స్పూన్ 13:1/2 కప్పు నూనె 14:ఒక కప్పు పెరుగు

15:ఉప్పు సరిపడినంత

తయారు చేయు విధానం: ముందు కూరగాయలన్ని కదిగి సన్న ముక్కలు చేసుకొని సరిపడ నీరు పోసి ఉడికించాలి.ఉడికిన ముక్కలు పక్కన పెట్టుకొని స్టవ్ మీద పాన్ పెట్టి నూనె పోయాలి అ తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు టొమట ముక్కలు పచ్చిమిర్చి,జీలకర్ర వేసి దొరగా వేయించాలి వ్3ఏగినతరువాత పాన్ లో ఉడికించిన ముక్కలు అన్ని వేయాలి(నీళ్ళు కూడ)స్టవ్ తగ్గించి ఉంచుకొని మిక్సీలో ఎండుకొబ్బరి నానబెట్టిన బియ్యం 4 పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని స్టవ్ మీద ఉన్న పాన్ లో అ పేస్ట్ వేసి బాగ కలియ బెట్టి ఐదు నిమిషాలు తగ్గించిన స్టవ్ మీద ఉంచి ఒక కప్పు పెరుగు కొంచం కొత్తి మీర అందులో వేసి సరిపడ సాల్ట్ వేసి బాగ కలపాలి క్రిందకు దింపి వేడిగా వడ్డించుకొండి

[ఇది చపాతి,పూరి లకు స్పెషల్ కర్రీ]